- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భలే ఉంది..!అక్రమ ఇసుక రవాణా..!
దిశ, భైంసా: నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని పెండ్ పల్లి, సాధ్గం, మాటేగాం, కామోల్ ఇలా పలు వాగులలో నుండి ఇసుక బకాసురులు విచ్చలవిడిగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. కొన్నిచోట్ల పగలైతే అధికారుల బెడద ఉంటుందని రాత్రిళ్ళు సైతం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుకను చూసి పలువురు స్థానికులు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ముధోల్ నియోజకవర్గంలోని పలు గ్రామల వాగుల నుంచి ఇసుక బకాసురులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు.
గ్రామాలలో వెలిసిన కమిటీలు కొన్ని చోట్ల 30 లక్షలు, మరికొన్ని చోట్ల పది నుంచి 20 లక్షలు వేలం పాట పాడి మరి తీసుకోగా, ఇటువంటి ఘటనలతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుందని, ఇప్పటికి ఎక్కడ ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని చలానా వేసిన దాఖలాలు లేవనీ... దాదాపు ప్రతి యేట ఎండాకాలం ప్రారంభం అవుతుందంటే ఇసుక దళారుల దందా మొదలై రెచ్చిపోతున్నారు.
బైంసా మండలంలోని మాటేగాం సుద్ధ వాగు నుండి కొందరు దుండగులు అక్రమంగా ఇసుక డంపు చేసి అధిక ధరలు పెరుగుతున్న తరుణంలో అమ్ముతున్న వైనం కూడా కనబడుతుంది. దీనిపై అధికారులు స్పందించి ప్రభుత్వ ఖజానాను కాపాడాలని పలువురుస్థానికులు కోరుకుంటున్నారు.