బ్రేకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ

by samatah |   ( Updated:2022-03-07 10:21:38.0  )
బ్రేకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..బైంసా ప్రయాణ ప్రాంగణం నుండి ఒక బస్సు (ts 18 t 1719) నిర్మల్ బయలుదేరగా, అదే ప్రయాణ ప్రాంగణం నుంచి మరో బస్సు (ap 28 z 4047) గొల్లమాడ గ్రామానికి బయలుదేరింది. రెండు బస్సులు నిర్మల్ రూట్‌లో ప్రయాణించగా బైంసా మండలం వానల్ పాడ్ దాటినా తర్వాత గొల్లమాడ వెళ్లే బస్సు, నిర్మల్ వెళ్లే బస్సును వెనుక నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story