- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
దిశ, బెజ్జుర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బెజ్జూర్ మండలంలో రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పెంచికలపేట మండలం ఏలూరు గ్రామానికి చెందిన సయ్యద్ ఆలియాస్, డోకే సతీష్‌లు రాయల్ ఎన్ఫీల్డ్ టీఎస్ 19 బీ 69 60 బండి పై బెజ్జూర్ నుండి గంగరంగుడా కు చెందిన తోడేశం హరి, మేక స్వాతి, ఆత్రం మంజుల ముగ్గురు కలిసి ఒకే బైక్‌పై వెళ్తున్నారు.
కాగా, బుధవారం అర్ధరాత్రి బెజ్జూర్ మండలం గొల్ల భాయ్ చెరువు వద్ద ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీకొట్టడంతో డోకే సతీష్ 23 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా, ఏలూరు గ్రామానికి చెందిన సయ్యద్‌కు తీవ్రగాయాలు కాగా, హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. బెజ్జూర్ మండలం గంగారం చెందిన తోడేశం హరి, స్వాతి ,ఆత్రం మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగజ్‌నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని బెజ్జూర్ ఎస్ఐ ప్రసాద్ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు