- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మతాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలి..
దిశ, మంచిర్యాల టౌన్ : మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న రంజాన్ మాసంతో పాటు ఈ నెల చివరిలో వస్తున్న శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండుగలను జిల్లావాసులు మతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కోరారు. గురువారం మంచిర్యాలలోని స్థానిక డీసీపీ కార్యాలయం జిల్లాకు సంబంధించిన ముస్లిం, హిందూ మత పెద్ధలతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ పోలీస్ వారికి సహకరించాలని, జిల్లా పరిధిలో ప్రతిఒక్కరు సోదర భావం కలిగివుండి శాంతియుత వాతారణంలో పండుగలు జరుపుకోవాలని, మీడియాలో వచ్చే వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసత్య వార్తలను నమ్మి ప్రచారం చెయ్యవద్దని కోరారు.
ఏ సమస్య వచ్చినా స్పష్టంగా మత పెద్దలు, పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీసుశాఖ పరంగా చేపట్టాల్సిన విధులు నిర్వర్తించడంతో పాటు పోలీసుశాఖకు సహకరించాలని డీసీపీ అన్నారు. ఈ సంధర్భంగా స్థానికంగా ఉండే సమస్యలను అడిగి తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారమార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ రాజు, మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, మత పెద్దలు ఎస్సైలు పాల్గొన్నారు.