- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు శాపం..
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సిర్పూర్ నియోజకవర్గంలోని పలుమండలాల ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆదివారం రోజున పెంచికలపేట బెజ్జూర్ రూట్ లో ఉదయం 7:40 తర్వాత 10:30 గంటల వరకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో కాగజ్ నగర్ బస్టాండ్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన సమయపాలన పట్టిక ప్రకారం, కాగజ్నగర్ నుండి బెజ్జూరు, పెంచికలపేట రూట్ లో ఉదయం 7.45 తర్వాత 8:20, 9:30, 10:30 బస్సులు నడపాలి.
అధికారులు మాత్రం సమయపాలన పట్టికను పాటించుకోకుండా ఇష్టానుసారంగా బస్సులు నడుపుతూ, ప్రైవేటు వాహనాలు కూడా నడవలేని, మారుమూల గ్రామాల ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం అని ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు బస్సులు క్యాన్సల్ చేయడంతో గంటల తరబడి బస్టాండ్ లో బస్సుల కోసం వేచి చూస్తున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇలాంటి సమస్య పునరావృత్తం కాకుండా చూడాలని తగుచర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయమై డీఎం సంప్రదించగా పరీక్షల కారణంగా కొన్ని రూట్లలో బస్సులు నడపలేక పోయామని తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.