పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి

by Naresh |
పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి
X

దిశ, మంచిర్యాల టౌన్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, ఎల్.ఎ. ఆర్&ఆర్ ప్రత్యేక ఉప పాలనాధికారి డి. చంద్రకళతో కలిసి వీడియో, ఫ్లయింగ్, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు, వీడియో విజిలెన్స్ బృందాలు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల ఖర్చుల పరిశీలకులు, సహాయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందం, ఎక్సైజ్ బృందం, మీడియా సర్టిఫికేషన్ & మానిటరింగ్ కమిటీల ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3 కంటే ఎక్కువగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విధులు నిర్వహించడం జరుగుతుందని, నియోజకవర్గంలో జరిగే అంశాలను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని తెలిపారు.

ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఎన్నికల సంబంధిత ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు, కానుకల పంపిణీ పై ప్రత్యేక నిఘా ఉంచాలని, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఖర్చుల పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా పరిధిలో రూ. 50 వేల రూపాయల కంటే అధికంగా నగదు తరలించి నట్లయితే తనిఖీలలో తగిన ఆధారాలు లేనట్లయితే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వీడియో సర్వేలెన్స్ బృందాలు అనుమతి కలిగిన రాజకీయ పార్టీల సమావేశాలను రికార్డు చేయాలని, సమావేశాల సంబంధిత ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వీడియో చిత్రీకరించే సమయంలో వాయిస్, వీడియో సంబంధిత టైటిల్, తేదీ, ప్రాంతం, పార్టీ వివరాలు / అభ్యర్థి పేరు పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయాలని, వీడియో ఆధారంగా షాడో ఖర్చుల రిజిస్టర్లో వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఎంసీఎంసీ. బృందం పరిధిలో దినపత్రికలు, టీవీ. ఛానళ్ళు, మొబైల్ సందేశాలు, సోషల్ నెట్వర్క్ ప్రత్యేక దృష్టి సారించాలని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార సమయంలో తప్పనిసరిగా ఎంసీఎంసీ అనుమతి పొందాలని తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందం, ఎక్సైజ్ బృందాలు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed