ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం చేయాలి

by Sridhar Babu |
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం చేయాలి
X

దిశ, ఆదిలాబాద్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల ఏడున జిల్లా వ్యాప్తంగా కొలువుదీరిన గణనాథుల నిమజ్జనం నదులు, చెరువుల వద్ద ప్రశాంతంగా జరగాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఐదు నుంచి తొమ్మిది రోజులు పూర్తి చేసుకున్న గణనాథులను నిమజ్జనం చేస్తున్నందున భక్తులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈనెల 17న పూర్తిస్థాయిలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం నిమజ్జన ప్రాంతమైన పెనుగంగ వద్దకు వెళ్లి అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా ఎస్పీతోపాటు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు.

నిమజ్జన సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా విగ్రహాలను నదిలోకి దించేందుకు క్రేన్లు, విద్యుత్ సౌకర్యంతోపాటు గజ ఈతగాళ్లను అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా గణనాథుల నిమజ్జనం సమయంలో ఒకవైపు నుంచి వాహన రాకపోకలు ఉండే విధంగా చూడాలని, భక్తులు సంయమనం పాటించాలని కోరారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాలను తరలించే క్రమంలో రూట్ మ్యాప్ ను జిల్లా ఎస్పీ గౌడ్ ఆలంతో కలిసి పరిశీలించారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు ,మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed