బీఆర్ఎస్ అధినేత ఆశీర్వాదం ఎవరికో

by Mahesh |   ( Updated:2023-06-04 07:36:42.0  )
బీఆర్ఎస్ అధినేత ఆశీర్వాదం ఎవరికో
X

దిశ, ఖానాపూర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పాలనాధికారి కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆదివారం రానున్నారు. దీంతో జనసమికరణ కోసం ఖానాపూర్ నియోజకవర్గంలోని సిటింగ్ ఎమ్మెల్యే రేఖశ్యాం నాయక్‌తో పాటు అజ్మీరా శ్యాంనాయక్ ఎమ్మెల్యే అనుచరులు, నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీలో ఉన్న జాన్సన్ నాయక్, పూర్ణచందర్ నాయక్, శర్మన్ నాయక్ అనుచరులతో బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా జనసమికరణలో నిమగ్నమయ్యారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీలో ఉన్న నాయకులు జిల్లా కేంద్రంలో ఉన్న ముఖ్యమంత్రి సభకు జనసమీకరణ చేసి బీఆర్ఎస్ అధినేత మెప్పు పొంది టికెట్ పొందాలనే ఆలోచనలో ఉన్నారు. మరీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి..!

అధినేత మెప్పు కోసమే నా పోటాపోటీ జనసమీకరణ

నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవనికి ఆదివారం రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు భారీగా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలను తరలించి బీఆర్ఎస్ అధినేత మెప్పుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నియోజకవర్గంలో జనసమీకరణ చేయడానికి నిమగ్నమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్, ఎమ్మెల్యే భర్త అజ్మీరా శ్యాం నాయక్ ఇటీవల ఆర్టీఓ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన అనుచరులు నియోజకవర్గం నుంచి సీఎం సభకు ప్రజలను తరలించేందుకు భారీగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాంకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెప్పు పొందాలని చూస్తున్నారు. అలాగే నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానయక్‌ కూడా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ సాదించేందుకు ముఖ్యమంత్రి సభకు జనసమీకరణ చేస్తునట్లు ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు.

మరోపక్క నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ బరిలో ఉన్న కేటీఆర్ చిన్ననాటి మిత్రుడు, అనుచరుడు భూక్యా జాన్సన్ నాయకు కూడా నియోజకవర్గంలోని అనుచరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు భారీగా జనాన్ని తరలించేందకు శనివారం సమావేశాలు ఏర్పాటు చేశారు. సీఎం సభకు 10 వేల మందిని తరలించాలని కాన్వాయ్‌లను ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గం సెంటర్‌లోవున్న కడం మండల కేంద్రం నుంచి గుస్సాడీ నృత్యాలతో, భారీగా కాన్వాయ్‌లో ప్రజలతో ర్యాలీగా నిర్మల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు తరలివెల్లలని సముగ్ధం అయ్యారు. నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుండి లోకల్ సెంటిమెంట్‌తో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నా బాధవత్ పూర్ణ చందర్ నాయక్ అందుబాటులో లేకున్నా తన అనుచరులు సీఎం కేసీఆర్ సభకు భారీగానే వాహనాలు ఏర్పాటు చేసి జనసమికరణ చేస్తున్నారు.

Read More: త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ నిధుల విడుదలకు సీఎం KCR ప్లాన్..?

ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు KCR భారీ స్కెచ్.. ఎన్నికల వేళ గులాబీ బాస్ వ్యుహం ఫలిస్తుందా..?

Advertisement

Next Story