- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మందు బాబులకు కొత్త స్కీం
దిశ, నేరడిగొండ : రోడ్డు ప్రమాదాలకు రోడ్డు భద్రతా పరిజ్ఞానం ప్రయాణీకులకు, పాదచారులకు సరిగ్గా తెలియకపోవడం ఒక కారణమైతే, అధ్వాన మైన రోడ్లపై ప్రయాణించి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం మరొక పెద్ద కారణం. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, సోయి లేనితనం, కాంట్రాక్టర్ల అవినీతి, సంబంధిత అధికారుల కుమ్మక్కు, రోడ్లు శిథిలమై ధ్వంసమై నాణ్యత లేకుండా పోవడానికి ప్రధాన కారణాలు. ఈ కారణాలే కాకుండా ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యపానం రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారడం కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు.
యువతను, ప్రజానీకాన్ని, కార్మికులను, శ్రమజీవులను తాగుబోతులుగా మార్చి మద్యపానం అందుబాటులో ఉండే విధంగా చేసి ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కూడా మద్యాన్ని తాగమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే తాగి తాగి ఉన్మాదిగా మారక మరేం అవుతారు? అదేవిధంగా కొత్తగా స్కీం తెలంగాణ ప్రభుత్వ హయాంలో అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సిద్ధి వినాయక వైన్స్ లో తాగుబోతులను ప్రోత్సహిస్తూ కొత్త స్కీం అందుబాటులో తీసుకొచ్చారు. ఒక 90 ఎం.ఎల్ తీసుకుంటే ఒక గ్లాస్ రెండు వాటర్ ప్యాకెట్ ఉచితంగా ఇవ్వబడును అంటూ బహిరంగంగా ఫ్లెక్సీ పెట్టి అమ్ముతున్నారు.