బాసరలో విద్యార్థులకు లాప్టాప్ లు పంపిణీ చేసిన Minister KTR..

by samatah |   ( Updated:2022-12-10 06:07:22.0  )
బాసరలో విద్యార్థులకు లాప్టాప్ లు పంపిణీ చేసిన Minister KTR..
X

దిశ ప్రతినిధి నిర్మల్/ బాసర: బాసర ట్రిపుల్ ఐటీ లో అనేక ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ శనివారం తాను ఇచ్చిన హామీ నెరవేర్చారు. బాసర ట్రిపుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలపై జాతీయస్థాయిలో ప్రకంపనలు సృష్టించేలా విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే అన్ని రాజకీయ పార్టీలను కదిలించిన త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు సర్కారు దిగివచ్చింది. సెప్టెంబరు నెలలో స్వయంగా కేటీఆర్ వచ్చేదాకా విద్యార్థుల ఆందోళన దశలవారీగా కొనసాగింది ఈ నేపథ్యంలోనే నవంబర్ నెలలో తాను మళ్ళీ వస్తానని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. అయినప్పటికీ ఇటీవల త్రిబుల్ ఐటీ లో ఫుడ్ పాయిజన్ వ్యవహారం మళ్లీ ఆందోళనకు కారణం అయింది.

పది రోజులు ఆలస్యంగా..

నవంబర్ నెలలో వస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్ పది రోజులు ఆలస్యంగానైనా ఎట్టకేలకు శనివారం బాసర ట్రిపుల్ ఐటీ కి వచ్చారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి తో కలిసి ఆయన ట్రిపుల్ ఐటీ కి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి తాను ఇచ్చిన హామీ ప్రకారం లాంఛనంగా విద్యార్థులకు లాప్టాప్ లు అందజేశారు. మిగతా విద్యార్థులు అందరికీ 12వ తేదీన లాప్టాప్ లు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. దీంతో విద్యార్థుల్లో సంతోషం వెళ్లి విరిసింది. మరో గంట వ్యవధిలో జరగనున్న స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు.

Also Read....

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలకంగా చర్చించే అంశాలు ఇవే!

బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి KTR ఫైర్..

Advertisement

Next Story

Most Viewed