- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందిరమ్మ ప్రభుత్వాన్నే గెలిపించుకుందాం: సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క
దిశ, భీమిని: రాబోయే ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క అన్నారు. నెన్నల మండలం అవడం గ్రామంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు వాళ్ల సమస్యలు విన్నవించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనుల భూములను గుంజుకుంటున్నారని, ఇళ్లు ఇప్పిస్తాం అన్న మాటలు ఉత్తవేనని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం 10కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కిరోసిన్, పప్పు, చెక్కర, నిత్యవసర వస్తువులను రద్దు చేసిందని ప్రజలు బట్టి విక్రమార్కకు విన్నవించారు. నిరుపేదలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూంలను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించాలని మండిపడ్డారు. కోయగూడెంలో ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న తమ వైపు ఎవ్వరు కూడా కన్నెత్తి చూడడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.
తమకు కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలంటూ మల్లు బట్టి విక్రమార్కకు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను మళ్లీ ప్రజలకు అందిస్తమని హామీ ఇచ్చారు.