అలుపెరగని పోరాటయోధుడు కొమురం భీం

by Sridhar Babu |
అలుపెరగని పోరాటయోధుడు కొమురం భీం
X

దిశ, ఉట్నూర్ : ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన గొప్ప వీరుడు కొమురం భీం అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో కోమురం భీం 123వ జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం కొమురం భీం అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. భీం పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆదివాసీలకు జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు ఎన్నటికీ మరువలేనివన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేను యూనివర్సిటీ సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఎం.కుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్, ప్రొఫెసర్ మంగు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story