- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గత ఎనిమిది సంవత్సరాలుగా జిల్లా టాప్ ఆ పాఠశాల విద్యార్థులు..
దిశ, జన్నారం : ప్రతి సంవత్సరం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ (స్కాలర్షిప్) పరీక్షా ఫలితాల్లో జెడ్పీఎస్ఎస్ కిష్టాపూర్ విద్యార్థులు గత 8 సంవత్సరాల నుండి జిల్లాలో మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా 15 మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి మురళి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత శుక్రవారం వెలువడిన ఎన్ఎంఎంఎస్ ఫలితాల షార్ట్ లిస్ట్ లో పాఠశాల నుండి 15 మంది విద్యార్థులు ఎంపిక అయి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టికృషియే ఈ విజయాలకు కారణమని, ప్రతి ఉపాధ్యాయుని కృషి వల్లనే ఈ విజయం సాధించామని అన్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల నుండి 231 స్కాలర్షిప్ లు పొందిన ఏకైక పాఠశాల అని రాష్ట్రంలో కిష్టాపూర్ పాఠశాల నిలువడం గర్వంగా ఉందని అన్నారు. ఎన్ఎంఎంఎస్ (2022-23) ఫలితాలలో కిష్టాపూర్ విద్యార్థులు 15 మంది ఎంపికతో మంచిర్యాల జిల్లాలో అత్యధిక స్కాలర్షిప్ లను సాధించి మరోసారి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ సెకండ్ పాఠశాల విద్యార్థులు 231 స్కాలర్షిప్ లను సాధించటం విశేషం.