- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇసుక మాఫియాను అడ్డుకునే వారే లేరా?
దిశ, సారంగాపూర్: మండలంలోని యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ముఖ్యంగా బోరిగాం పరివాహక ప్రాంతం వాగులో నుండి ఇసుక తవ్వకాలు జరిపి చెట్ల చాటున వద్ద డంప్ చేసి రాత్రింబవళ్లు ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారు. ఇష్టానుసారంగా రవాణా జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొసైటీ చైర్మన్ స్థానిక ఎంపిటిసీ ఇసుక ట్రాక్టర్‌లను ఏర్పాటు చేసుకుని పట్టపగలే ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ అండదండలతో దర్జాగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సదరు ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ యంత్రాంగానికి నెలవారీ మామ్ముల్లు ఇస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వ యంత్రాంగం మాకెందుకులే అన్నట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు దారి తీస్తుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకొని మంచి నీటి జలాలను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.