సీఎం షెడ్యూల్లో బాసర దర్శనం వుందా..?

by Sumithra |
సీఎం షెడ్యూల్లో బాసర దర్శనం వుందా..?
X

దిశ, బైంసా : నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా జూన్ నాలుగున సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లాకి రానున్నారు. చిన్న నుంచి పెద్దవరకు రాజకీయ ప్రముఖులు, అధికారులు, వ్యాపారవేత్తలు ఇలా పలువురు నిర్మల్ జిల్లా వస్తున్నారంటే దాదాపు వారి షెడ్యూల్ ల్లో బాసర అమ్మవారిని దర్శించుకుంటారు. చదువుల తల్లి సరస్వతి కొలువై ఉన్న బాసర భారతదేశంలో ప్రముఖమైనది. సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లాకి వస్తున్న సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకుంటారా..? లేదా..? బాసర దర్శనానికి సంబంధించి షెడ్యూల్లో ఉందా..? లేదా..? అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల సీఎం కేసీఆర్ మనుమడు అమ్మవారిని దర్శించుకోగా... సీఎం కేసీఆర్ ఈ సారి బాసర అమ్మవారిని దర్శించుకుంటరా..? అలాగే బాసర ట్రీబుల్ ఐటీ విద్యార్థుల శాంతియుత పోరాటం గతంలో పలువురు ప్రశంసించగా, మంత్రి కేటీఆర్ సైతం శాంతియుత ఉద్యమానికి మెచ్చుకున్నారు. వీరు సైతం మాట్లాడడానికి, పలుసమస్యలను తెలుసుకోవడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ట్రీబుల్ ఐటీకి వచ్చి సమస్యల సాధనకు కృషి చేశారు. శాంతియుత పోరాటం చేసిన ట్రిపుల్ ఐ.టి విద్యార్థులను సీఎం కలుస్తారా..? లేరా..? అని ప్రజలు, విద్యార్థులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story