వెబ్ సైట్‌లో ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు

by S Gopi |
వెబ్ సైట్‌లో ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు
X

దిశ, తాండూర్: తెలంగాణ ఇంట‌ర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టికెట్లను అన్ని కళాశాలల యాజమాన్యాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తేదీ సాయంత్రం నుండే కళాశాలల లాగిన్లలో ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. హాల్ టికెట్లలో త‌ప్పులుంటే విద్యార్థులు స‌రి చేసుకోవాల‌ని సూచించారు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంత‌కం లేకున్నా విద్యార్థులు ప‌రీక్షలు రాయవచ్చన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లు www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 1వ వ‌ర‌కు ఇంట‌ర్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed