- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Illness : ఐదు రోజులైనా కోలుకోని విద్యార్థులు
దిశ, వాంకిడి : మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్న విద్యార్థినుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఐదు రోజులు గడుస్తున్నా ఇంకా విద్యార్థుల ఆరోగ్యం కుదుట పడలేదు.
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 13 మంది, ఆసిఫాబాద్ సర్కార్, ప్రైవేటు దవాఖానాల్లో 15 మంది, మంచిర్యాలలో మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. ఆదివారం జ్యోతిక, మహాలక్ష్మి అనే ఇద్దరు విద్యార్థినులను హైదరాబాద్ నిమ్స్ కు రెఫెర్ చేశారు. విద్యార్థుల అనారోగ్యానికి గల కారణాలు, వారి ఆరోగ్యం పరిస్థితులపై హాస్టల్ సిబ్బంది క్లారిటీ ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పిల్లల ఆరోగ్యంపై హాస్టల్ సిబ్బంది ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సమాధానం ఇస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.