అక్రమ ఇసుక తరలిస్తే భారీ జరిమానా తప్పదు..

by Sumithra |
అక్రమ ఇసుక తరలిస్తే భారీ జరిమానా తప్పదు..
X

దిశ, భైంసా : అక్రమ ఇసుక తరలింపుల పై అధికారులు ఎట్టకేలకు కొరడా ఝులిపించారు. భైంసా తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి అక్రమ ఇసుకను తరలిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఇసుకను తరలించాటానికి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ తహశీల్దార్ మండల పరిషత్తు అధికారులకు ట్రాక్టర్ కు రూ. 808 చెల్లిస్తే వేబిళ్ళు ఇస్తామని చెప్పారు. అదికూడా మండల పరిధి వరకు మాత్రమే వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.

వేబిల్లులు లేకుండా ఇసుకను తరలించే ట్రాక్టర్లకు రూ.5వేల నుంచి లక్షరూపాయల వరకు జరిమానా విధించటం జరుగుతుందని, అదేవిధంగా గ్రామాభివృద్ధి కమిటీలకు ఇసుకను వెలంవేసే అధికారం లేదని సూచించారు. పట్టణంలో ఇప్పటికే 15 ఇసుక డంపులను గుర్తించామని, వాటిపై విచారణ చేపట్టతామని తహశీల్దార్ తెలిపారు. లారీల్లో ఇసుక తరలింపు కోసం జిల్లా మైనింగ్ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి లేదా వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ప్రభుత్వ పాటశాల భవనాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఇందులో మినహాయింపు ఉందని సూచించారు. వేబిల్లుల జారి పై పక్షం రోజులకు ఒక సారి మైనింగ్ శాఖతో సమీక్ష ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed