- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే.. కారుణ్య నియామకాలు కల్ల : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్
దిశ, మందమర్రి : సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే కారుణ్య నియామకాలు కల్ల అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. శుక్రవారం మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ సభకు వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. 1998 సంవత్సరంలో జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి సంస్థలు తండ్రీ కొడుకుల ఉద్యోగాలు పోగొడితే కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు.
నిత్యం బొగ్గు పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికి తీసి దేశ సైనికులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను మినహాయించాలని డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో త్వరలో రూ.500 కోట్లతో మందమర్రి మండలంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. వ్యాపార, వర్తక, వాణిజ్య, రంగాల్లో పట్టణం అభివృద్ధి చెందాలని రూ.వేలాది కోట్లను అభివృద్ధికి తీసుకు వస్తున్నామని తెలిపారు.
పట్టణంలో రూ.172.35 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మందమర్రి పట్టణం గిరిజన ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో 50 శాతానికి పైగా గిరిజనులు, ఆదివాసులు, కొండ ప్రాంతాల్లో, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే అమలు చేయాలని బురియా కమిటీ పార్లమెంట్ కు సిఫార్సు చేసిందని తెలిపారు. కానీ మందమర్రిలో కేవలం 2.68 శాతం గిరిజనులు మాత్రమే నివసిస్తున్నారని అన్నారు.
తద్వారా 76, 58, 59 జీవోలు అమలు చేయలేక పోతున్నామని వివరించారు. ఇక్కడ భూములు కొనుగోలు చేసి భవన నిర్మాణాలు చేయాలనుకుంటే మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వదని, బ్యాంకులు రుణాలు ఇవ్వరని తెలిపారు. చాలా సంవత్సరాలుగా మున్సిపాలిటీకి ఇక్కడ ఆదాయం రాక అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు.
మున్సిపాలిటీకి ఎన్నికలు, పాలక పక్షం లేక ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ 1/70 చట్టాన్ని అమలు చేసిన కాంగ్రెస్, బీజేపీలు రానున్న ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, నారదాసు లక్ష్మణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.