MLA : ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

by Kalyani |
MLA : ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
X

దిశ, భీమిని : ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం. వినోద్ అన్నారు. గురువారం కన్నెపల్లి మండల కేంద్రంలో రూ.1 కోటి నిధులతో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు, మండలాల విభజనచేపట్టిన అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోలేదన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో భీమిని మండలం నుండి కన్నెపల్లి మండలం నూతనంగా ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు గడుస్తున్న అద్దె భవనాల్లోనే కార్యాలయం నుంచి అరె కోర వసతులతో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలు నిత్యం విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంతో మారుమూల గ్రామాల రూపురేఖలు మారుతాయని సభాముఖంగా తేల్చి చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని గుత్తేదారు త్వరగా పూర్తిచేసి మండల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా డి.ఎం.హెచ్.ఓ హరీష్ రాజ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో వైద్యులు ప్రజలకు అందించే వైద్య సేవలు మరువలేనివన్నారు. నిత్యం గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి వైద్య సేవలు కొనసాగించడం అభినందనీయమన్నారు. కన్నెపెల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం మంజూరు కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ సుధాకర్.నాయక్, భీమిని వైద్యులు కుమారస్వామి, కన్నెపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధవరపు, నరసింగారావు, భీమిని మండల అధ్యక్షుడు గాదం. లక్ష్మీనారాయణ, నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

Next Story