సిర్పూర్‌ను గుండెలో పెట్టుకొని చూసుకుంటా

by Naresh |   ( Updated:2024-03-28 14:50:26.0  )
సిర్పూర్‌ను గుండెలో పెట్టుకొని చూసుకుంటా
X

దిశ, కాగజ్ నగర్: సిర్పూర్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని బీఆర్‌ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం సిర్పూర్ నియోజక వర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను గారడి చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు. సిర్పూర్ నియోజకవర్గం బిడ్డనని నేనెప్పుడూ సిర్పూర్ నియోజకవర్గం ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానని మాట ఇచ్చారు. పార్టీ మారడంపై అధిష్టానం సూచనల మేరకు బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌తో పొత్తు కుదిరిందన్నారు. సిర్పూర్‌లో బీఆర్ఎస్ నుంచి ఓటమిపాలైన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ అధికార పార్టీతో చేరీ మళ్లీ సిర్పూర్‌లో దందాలపై కన్నేసాడని అన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రజలు గమనించి భారత రాష్ట్ర సమితిని గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతో అన్నదాతలకు కంటిలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను అధిక మెజార్టీతో గెలిపించి మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిటల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బెజ్జూర్ జడ్పీటీసీ పుష్పలత, నాయకులు లేండుగురే శ్యామ్ రావు, రాంప్రసాద్, వివిధ మండలాల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed