- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మావలలోని చావర అకాడమీ, సీబీఎస్సీ సెకండరీ హైస్కూల్, మహాత్మాగాంధీ జ్యోతి బా పూలే పాఠశాల, భూక్తపూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేసి, సీసీ కెమెరాలను, అభ్యర్థుల హాజరుశాతం, బయోమెట్రిక్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు ఆదివారం , సోమవారం రెండు రోజులు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆదివారం ఉదయం సెషన్ లో జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం10,428 మంది అభ్యర్థులకు గాను 5,905 (56.63 శాతం ) మంది హాజరు కాగా, 4,523. (43.37 శాతం) మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. కాగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి, అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.