- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యాం నాయక్
దిశ, ఖానాపూర్: దేశం అభివృద్ధికి రైతే మూలం అని అందుకే బీఆర్ఎస్ పార్టీ రైతుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యాంనాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మార్కెట్ యార్డులో, పెంబి మండల కేంద్రంలో శనివారం మక్కల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో తమ చెనులో వేసుకున్న పంటను నమోదు చేయించుకోవాలన్నారు.
మొక్కజొన్న పంట ఎకరానికి 26 క్వింటాలు కొనుగోలు చేస్తారని తెలిపారు. మొక్కజొన్నకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర రూ.1,960 ప్రకటించిందన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పండించిన ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మాజీ జడ్పీటీసీ రాథోడ్ రాంనాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కరిపే శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ పుప్పాల శంకర్, కౌన్సిలర్ కే.సంతోష్, సీఈవో భూమి ఆశన్న, డైరెక్టర్లు, తెరాస నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.