- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుగ్గజాతరకు సర్వం సిద్ధం..
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయం శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. బుగ్గ జాతర మూడు రోజులపాటు అత్యంత వైభవంగా సాగుతుంది. వేలాది మంది భక్తులు జాతరకు వచ్చి ముక్కులు చెల్లించుకుంటారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బుగ్గజాతరకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. శుక్రవారం రామగుండం సీపీ రెమ రాజేశ్వరి బుగ్గ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిరకాల ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. వేలాదిమంది భక్తులు జాతరకు రానున్న దృష్ట్యా ఏర్పాట్లు ఘనంగా చేశారు. సీపీ రెమ రాజేశ్వరి బుగ్గ ఆలయంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని అన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తగిన భద్రతను కట్టు దిట్టం చేస్తామన్నారు. భక్తులు కుటుంబాల సమేతంగా జాతర సందర్భంగా వచ్చి సంతోషంగా ముక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి చేరుకినే విధంగా అన్నిరకాల చర్యలు ఉంటాయన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యం కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా గర్భగుడిలోకి భక్తులు వెళ్లేందుకు ప్రత్యేకంగా బార్కెట్లు ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భంగా బుగ్గ ఆలయాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దారు. ఆలయం చుట్టూ సేమ్యాలు ఏర్పాటు చేయడంతో దేవాలయం సర్వాంగ సుందరంగా మారింది. ఆలయాన్ని సందర్శించిన రామగుండం సీపీ రెమ రాజేశ్వరి వెంట మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రాంనాథ్, బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, బెల్లంపల్లి రూరల్ సీఐ రాజకుమార్ గౌడ్, తాళ్ల గురజాల ఎస్సై రాజశేఖర్, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై ఆంజనేయులు ఉన్నారు.