అందుకే ఆ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు.. ఎమ్మెల్యే బాల్క సుమన్

by Sumithra |
అందుకే ఆ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు.. ఎమ్మెల్యే బాల్క సుమన్
X

దిశ, చెన్నూర్ : గతపాలకుల చేతకానితనం, నిర్లక్ష్యం కారణంగానే నియోజకవర్గ అభివృద్ధి నోచుకోలేదని ప్రభుత్వ విప్.స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆధ్వర్యంలో షాదిముబారక్, కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల చరిత్రలో ఎన్నడు లేనివిధంగా మండలంలోని 369 మంది ఆడపడుచులకు 3,69,92,862/- విలువ గల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 57 మంది లబ్ధిదారులకు 26,45,800/- విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు ఎటువంటి ఆలస్యం చేయకుండా అందజేస్తున్నామని ఆయన అన్నారు.

ఏ పేదింటి తండ్రి తన బిడ్డ పెండ్లికి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి ఆలోచనల నుండి పురుడుపోసుకున్న అపూర్వపథకం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలని, పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా కేసీఆర్ గడచిన 8 ఏళ్లలో 10 లక్షలమందికి పైగా పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించామని ఆయన అన్నారు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలనే గొప్పలక్ష్యంతో సమ్మక్క - సారలమ్మ మహిళా భవనాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలోని 102 గ్రామపంచాయతీలలో ఒక్కో భవనానికి 18లక్షలు వెచ్చించి 102 “సమ్మక్క - సారలమ్మ” మహిళా భవనల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు.

తొలి విడతలో భాగంగా 77 గ్రామాలను ఎంపిక చేశామని ఇప్పటికే చెన్నూరు మహిళా భవనానికి 1.50, రామకృష్ణాపూర్ మహిళాభవన్ కు 2 కోట్లు, మందమర్రి మహిళా భవన్ కు 2 కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. ఈ భవనాలు మహిళల సృజనాత్మకతకు పదును పెట్టి వృత్తి నైపుణ్యాలకు ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని, మహిళా భవనాలలో ఆయారంగాలలో నిష్ణాతులైన వారి నుండి శిక్షణను అందించి మహిళలను ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయడానికి సహాయపడుతుందని అన్నారు. మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని. తల్లిబిడ్డ మహిళల క్షేమం కోరుతూ ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 13,90,634 మంది ల‌బ్ధిదారులకు, రూ. 243 కోట్లు విలువ చేసే 12,85,563 కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామని అన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో తెలంగాణ ఏర్పడినప్పుడు 30శాతంగా ఉన్న ప్రసవాలు ఇప్పుడు 66 శాతానికి పెరిగాయని అందులో భాగంగా మగ బిడ్డ పుడితే 12 వేలు, ఆడబిడ్డకు 13 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని ఆయన అన్నారు. మహిళల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతు ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు, కేసీఆర్ కిట్, అమ్మఒడి, ఆరోగ్య లక్ష్మి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, షీ టీమ్స్ పథకాలు మహిళల కోసం తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed