Padi Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

by Y. Venkata Narasimha Reddy |
Padi Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
X

దిశ, వెబ్ డెస్క్ : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy)ని ఈరోజు ఉదయం పోలీసులు హౌస్ అరెస్టు(House Arreste)చేశారు. తన కమ్యూనిటీ ఏరియాలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు అతడిని హౌస్ అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు జిమ్‌కు వెళ్తున్న ఆయనని అడ్డుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి నిరాకరించారు.

ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులో భాగంగా కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అటు అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.



Next Story

Most Viewed