MP Chamala: సభకు వాడింది ఆ సొమ్మేనా..! BRSపై ఎంపీ చామల సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
MP Chamala: సభకు వాడింది ఆ సొమ్మేనా..! BRSపై ఎంపీ చామల సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ జిల్లా (Warangal District) ఎల్కతుర్తి (Elkathurthy) వేదికగా నిర్వహించబోతున్న 25 ఏళ్ల ఆవిర్భావ సభను గులాబీ అధినాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అదే సభపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకుల నరాలు తెగుతాయని అన్నారు. ఒక్కో రూపాయి పోగేసి సభను సక్సెస్ చేస్తే చాలు.. హమ్మ్య అని ఊపిరి పీల్చుకుంటాని తెలిపారు.

ఇక ప్రతిపక్షంలో ఉండి ఓ సభ నిర్వహించాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదు. కానీ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ చూస్తుంటేనే కళ్లు చెదురుతున్నాయని అన్నారు. రూ.వందల కోట్లు ఖర్చు చేస్తే తప్ప.. అలా సభ నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. జనాన్ని ఎంత మందిని తోలుతారు.. అందుకు ఖర్చెంత అనేది తరువాత విషయమని.. సభ ఏర్పాట్ల తీరే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయని కామెంట్ చేశారు. ఆ వేదిక, హంగామా, ఆర్భాటం చూస్తుంటే ఊహకందనంత ఖర్చే అయి ఉంటుందనే విషయం సామాన్యుడికి కూడా అర్థమవుతోందని అన్నారు. ఆ డబ్బు కూలిన కాళేశ్వరం (Kaleshwaram) సొమ్మా అని ప్రశ్నించారు.

మిషన్ భగీరథ (Mission Bhagiratha) పేరుతో పాత ట్యాంకులకు రంగులేసి.. పాత తాగునీటి పథకాలను లింక్ చేసి దోచిన సొమ్మా అని సెటైర్లే వేశారు. హైదరాబాద్ బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కోసం వసూలు చేసిన అదనపు ఫ్లోర్ల కమీషన్ సొమ్మ అంటూ ఫైర్ అయ్యారు. ఫార్ములా ఈ కారు రేస్ (Formula E-Car Race) పేరుతో ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టిన సొమ్మా, ధరణి (Dharani) పేరుతో అర్ధరాత్రుల్లో భూ హక్కులను మార్చేసి దోచిన వేల ఎకరాల దోపిడీ సొమ్మా అంటూ ఎద్దేవా చేశారు. కానామెట్, నియోపోలీస్, కోకాపేట్‌లలో వేల కోట్ల విలువ చేసే భూములను వేలం పేరుతో అనునయులకు దోచిపెట్టగా వచ్చిన సొమ్మా అని ధ్వజమెత్తారు. రూ.లక్షల కోట్ల విలువ చేసే ఔటర్ రింగ్ రోడ్డును కేవలం రూ.7 వేల కోట్లకు 33 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేయడంతో వచ్చిన సొమ్మా అని అన్నారు. కేవలం 2 గంటల సభ కోసం ఖర్చు చేస్తోన్న రూ.కోట్ల ధన ప్రవాహం ఏ కమీషన్ల తాలుఖాదో తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ చెప్పాలి అంటూ చామల ట్వీట్ చేశారు.


Next Story