- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డా.వేణుగోపాల కృష్ణకు ఘన సన్మానం
దిశ, నిర్మల్ రూరల్: నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ఎంవోగా సేవలందిస్తున్న డాక్టర్ వేణుగోపాల కృష్ణను ఘనంగా సన్మానించారు. డాక్టర్ వేణుగోపాల కృష్ణ ఎలాంటి ప్రైవేట్ ప్రాక్టీస్ లేకుండా ఓ ప్రభుత్వ డాక్టర్ గా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నారు. పోస్టుమార్టం కేసులకు అందుబాటులో ఉంటూ కేసుల పరిష్కారంలో పోలీసులకు సహాయ సహకరాలందిస్తూ ఉత్తమ వైద్యాధికారిగా ప్రశంసలు పొందారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పలు కేంద్ర, రాష్ట్ర అవార్డులు వరించాయి.
ఈ సందర్భంగా జడ్పీ పర్సన్ విజయలక్మి, రాంకిషన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.