- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దు : దివాకర్ రావు
దిశ, మంచిర్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దని మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు కోరారు. మంగళవారం దండేపల్లి మండలం లోని నాగసముద్రం, మాకులపేట, వెల్గనూర్, నంబాల, గుడిరేవు గ్రామాల్లో ఆయన ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఏదో ఒక రీతిలో అందాయని చెప్పారు. పంటలకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకంతో రైతన్నలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని ఆ బాధలు లేకుండా చేశారని చెప్పారు. సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే బీఆర్ఎస్ కే ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, దండేపల్లి వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, నాయకులు మోట పలుకుల గురువయ్య, చుంచు శ్రీనివాస్, బండారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి తిరుగుతూ దివాకర్ రావు సతీమణి ప్రచారం..
పాత మంచిర్యాల లోని పలు వాడల్లో మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు సతీమణి రాజకుమారి ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టో పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలు కావాలన్నా, అభివృద్ధి పనులు జరగాలన్నా కారు గుర్తుకు ఓటు వేసి దివాకర్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ ప్రచారంలో పాల్గొన్నారు.