dog attack : ముగ్గురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి

by Sridhar Babu |
dog attack : ముగ్గురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి
X

దిశ, తాండూర్ : మండలంలోని మాదారం టౌన్ షిప్ లో ఆదివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. జనని, తన్వి, సుహాన్ అనే చిన్నారులు తమ ఇళ్ల ముందు నిలబడి ఉండగా పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. పిచ్చికుక్క ఒకే రోజు ముగ్గురిపై దాడి చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారులను చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాదారం టౌన్ షిప్ లో గత కొన్ని రోజులుగా పిచ్చి కుక్కల బెడద అధికమైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పిచ్చికుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story