కార్పొరేట్ పార్టీ కావాలా..లేక రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ కావాలా : మంత్రి సీతక్క

by Disha Web Desk 11 |
కార్పొరేట్ పార్టీ  కావాలా..లేక రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ కావాలా : మంత్రి సీతక్క
X

దిశ, ఆసిఫాబాద్ : కార్పొరేట్ దోపిడి దారుల పార్టీ కావాలా… లేక ప్రజస్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను కల్పించే కాంగ్రెస్ పార్టీ కావాలా అంటూ ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కామెంట్స్ చేశారు. బీజేపీ పదేళ్ల పాలనలో మీకు ఇళ్లు నిర్మించి ఇచ్చిందా, లేక వాడల్లో రోడ్డు, కరెంట్ కానీసం నీళ్లు ఇచ్చిందా, మరి ఎందుకు బీజేపీ ఓటు వేయాలని ప్రశ్నించింది.

బీజేపీ పేదల పార్టీ కాదని, కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టే పార్టీ అని మను ధర్మ సిద్ధాంతం పాటించే పార్టీని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారం కోల్పోయిన ఇంకా అధికార మత్తులోనే జీవిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ సమస్య లేవని, పదవి దిగిన తర్వాత అన్ని సమస్యలు వచ్చాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ కు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చో బెట్టాలని ప్రజలను కోరారు.

Next Story

Most Viewed