- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టణ ప్రగతి వేడుకలకు కౌన్సిలర్ల గైర్హాజరు..
దిశ, రామకృష్ణాపూర్ : పట్టణ ప్రగతి వేడుకలలో భాగంగా క్యాతన్ పల్లి పురపాలకం ఆధ్వర్యంలో సోమవారం హరితహారం కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు. చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డిలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పురకమిషనర్ వెంకట నారాయణ మాట్లాడుతూ పట్టణ ప్రగతి హరితహారంలో భాగంగా 450 మొక్కలు నాటారు. కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటుండడంతో తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుని హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రామానికి అటవీ డిప్యూటీ రేంజ్ అధికారి సంతోష్, పుర మేనేజర్ నాగరాజు కౌన్సిలర్లు, ఓబీ, అర్పిలు పాల్గొన్నారు.
గైర్హాజరైన కౌన్సిలర్లు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి వేడుకలకు క్యాతన్ పల్లి పురపాలక అధికార పార్టీ కౌన్సిలర్లు కొందరు దూరంగా ఉంటున్నారు. పురపాలకం 22 మంది కౌన్సిలర్లు ఉండగా సోమవారం క్యాతన్ పల్లిలో నిర్వహిచిన హరితహారం కార్యక్రమనికి చైర్మన్, వైస్ చైర్మన్ లతో కేవలం 7 గురు కౌన్సిలర్లు మాత్రమే పాల్గొనగా మిగిలిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. పట్టణ అభివృద్ధిలో కీలకంగా బాధ్యాతాయుతంగా వ్యవహరించవలసిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమలకు దూరంగా ఉండటం వారి బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతోంది. స్వయానా ముఖ్యమంత్రి రూపొందించిన దశాబ్ది ఉత్సవాలకు సగానికి ఎక్కువ మంది కౌన్సిలర్లు, హాజరుకాకపోవడంతో పరిపాలనలో పాలుపంచుకుంటున్నారా?మొక్కుబడిగా సంతకాలు పెట్టేసి గమ్మున ఉంటున్నారా ? అని పట్టణ ప్రజలు ఈ విషయం పై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.