- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతుంది..
దిశ, మందమర్రి : దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ వ్యయంలో భారతదేశం అన్నిరంగాల అభివృద్ధిలో దూసుకుపోతుందని మాజీ పెద్దపెల్లి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి కిటాబిచ్చారు. శనివారం పులిమడుగు గ్రామపంచాయతీలో భాజపా మందమర్రి మండల అధ్యక్షులు పైడి మల్ల నర్సింగ్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటుతో ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చారని అన్నారు.
ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ గృహాలు, నిరుద్యోగ భృతి, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నియోజకవర్గం ఆసుపత్రి, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అంటూ ఎన్నో హామీలను ఇచ్చి మోసం చేశారని అన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి రోడ్లు తదితర పథకాలు అమలులో లక్షల కోట్ల రూపాయలను అందజేస్తుందని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నగంటి రంగారావు, రాష్ట్ర సీనియర్ నాయకులు ఆరుమూళ్ల పోశం, మంచిర్యాల జిల్లా కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, చెన్నూరు నియోజకవర్గం కన్వీనర్ అక్కల రమేష్, బుక్య రాజేష్ నాయక్, చిప్పకూర్తి బానేష్, శనిగారపు శేఖర్ మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్ తదితరులు ఉన్నారు.