రేవంత్ రెడ్డి హథ్ సే హథ్ జోడో యాత్రలో విబేధాల మంటలు..

by Sumithra |
రేవంత్ రెడ్డి హథ్ సే హథ్ జోడో యాత్రలో విబేధాల మంటలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టిలో కొత్తతరం వస్తునే ఉంటది పాతతరం పొతునే ఉంటదనే నానుడి ఉంది. కాంగ్రెస్ పార్టీ అనగానే అందరికి కురువ్రుద్ధుల పార్టిగా చెబుతుంటారు. కొత్తతరంకు పాత తరంకు బేదాభిప్రాయాలు సహజం అందరం కలిసి మెలిసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం అని చెప్పే కాంగ్రెస్ పార్టి రాష్ర్ట అధినేత రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హథ్ సే హథ్ జోడో పాదయాత్రలో ఉండగానే విభేదాలు బహిర్గతం అయ్యాయి. గాందారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష సంధర్బంగా పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి సాక్షిగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో అసెంబ్లి అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యత పై షబ్బీర్ ఆలీ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి.

రేవంత్ రెడ్డి సభప్రారంభంకు ముందే సభాస్థలి వద్ధ సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ వర్గీయులు కయ్యానికి సిద్ధమయ్యారు. ఇంకా అప్పుడే రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సుభాష్ రెడ్డి స్థానంలో జాజుల సురేందర్ కు టికెట్ కేటాయించిన విధానం పై చేసిన వ్యాఖ్యలు కామారెడ్డి కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాలకు అజ్యం పోశాయి. దానితో మంగళవారం కామారెడ్డి జిల్లాలోనే సాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్రకు మదన్ మోహన్ వర్గం దూరం అయింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే మదన్ మోహన్ కామారెడ్డిలో విలేఖరుల సమావేశం నిర్వహించి మాజీ మంత్రి షబ్బిర్ ఆలీని ఉద్ధేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలను బహిర్గతం చేశాయి.

కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి షబ్బిర్ ఆలీ ఒక వర్గం, టీపీసీసీ ఐటి సెల్ చైర్మెన్, పార్టీ రాష్ర్ట ఉపాధ్యక్షులు కల్వకుంట్ల మదన్ మోహన్ రావులు మరో వర్గంగా గ్రూప్ రాజకీయాలను చేస్తున్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికలలో తక్కువ మెజార్టితో జహిరాబాద్ ఎంపీగా ఓడిన మదన్ మోహన్ రావు ఓడిపోయినప్పటి నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోటికి ఎర్పాటు చేసుకుంటున్నారు. కాని అక్కడ పార్టి నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న సుబాష్ రెడ్డి సైతం తనకు టికేట్ వస్తుందని ధీమాతో అండర్ గ్రౌండ్ పని చేస్తున్నారు. మదన్ మోహన్ రావుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్ధిన్ అండగా ఉండగా, సుభాష్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్గియునిగా షబ్బిర్ ఆలీ మద్ధత్తు ఉంది. గడిచిన ఎడాది ఎల్లారెడ్డిలో రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా బహిరంగ సభ సాక్షిగానే ఇద్ధరి మద్య విబేధాలు బహిర్గతం అయ్యాయి.

దానితో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు టీపీసీ ఐటిసెల్ చైర్మెన్ గా ఉన్న మదన్ మోహన్ ను సస్పెండ్ చేయడం కలకలం రేపింది. దానిని ఆయన పార్టీ క్రమశిక్షణ కమిటి ముందుకు తీసుకువేళ్లారు. గడిచిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ బ్యానర్లు, కరపత్రాలు ఉన్నాయని ఎల్లారెడ్డిలో మధన్ మోహన్ కాన్వాయ్ పై సుభాష్ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. అది అలా ఉండగానే ఇద్దరు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోటీ పడిసేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈ నెల మొదటి వారంలో అజారుద్దీన్ ద్వారా ఎల్లారెడ్డిలో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ సమావేశంలో పార్టీ ఆదేశిస్తే తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించడం కాంగ్రెస్ లో ఖయ్యానికి దారి తీసింది. తాజాగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థుల బాధ్యతలు చూస్తానని ప్రకటన చేయడం మధన్ మోహన్ వర్గానికి మింగుడుపడడం లేదు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని టీపీసీసీ ఐటి సెల్ చైర్మన్ కల్వకుంట్ల మధన్ మోహన్ రావు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ ఆలీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

ఏడుసార్లు పోటీ చేసిన షబ్బీర్ ఆలీ ఒక్కసారే గెలిచారని, పార్టీ పదవుల్లో కనీసం కొడుకును గెలిపించుకోలేడని వ్యాఖ్యానించారు. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకే టికెట్ ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు సొత్తు కాదని, పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్ వస్తుందన్నారు. షబ్బీర్ ఆలీ రెండు నియోజకవర్గాల బాధ్యతలు చూస్తానని అనడం పై మండిపడ్డారు. ఎమ్మెల్యేల టికెట్లు ఎంపిక చేసే కార్యక్రమం ఏఐసీసీకి మాత్రమే ఉందని, పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని అన్నారు. ప్రజలు మధన్ మోహన్ ను నాయకునిగా వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటానని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story