- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మికుడి మరణానికి వారే బాధ్యత వహించాలి : బి.మధు
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా చంద్ర మోహన్ విధులు నిర్వహిస్తూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే కార్మికుడు మృత్యువాత పడ్డాడని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.మధు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుడి మరణం అనుకోకుండా జరిగింది కాదని, రక్షణ చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం చేసిన నిర్లక్ష్యం ఫలితంగానే జరిగిందని ఆయన ఆరోపించారు. ఒక రకంగా ఇది సింగరేణి యాజమాన్యం, పవర్ మేక్ కాంట్రాక్టర్ కలిసి చేసిన హత్య అని విమర్శించారు. సింగరేణిలో ఒక పక్క రక్షణ పక్షోత్సవాలు నిర్వహిస్తూ ఉండగానే రక్షణ చర్యలు లేకపోవడంతో కాంట్రాక్టు కార్మికుడు మరణించడం బాధారమన్నారు. సింగరేణి యాజమాన్యం, పవర్ మేక్ కంపెనీ పై హత్య కేసును నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
పవర్ ప్లాంట్ లో నిరంతరం రక్షణ చర్యలను పర్యవేక్షించాలని, ఫ్యాక్టరీ ఇన్స్ పెక్టర్లు యాజమాన్యంతో కుమ్మక్కవుతున్నారని ఆయన అన్నారు. సింగరేణి యాజమాన్యం మరణించిన కార్మికుడి కుటుంబానికి తన వాటాగా చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించాలని, రక్షణ సూత్రాలను పేపర్ మీద, గోడల మీద కాకుండా ఆచరణలో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, దూలం శ్రీనివాస్, ఎండీ. అజిజ్ తదితరులు పాల్గొన్నారు.