Collector Rajarshi Shah : పాఠకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి

by Aamani |
Collector Rajarshi Shah : పాఠకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆకుల మధ్య జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులు ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించి తనిఖీ చేశారు. గ్రంధాలయంలోని అన్ని విభాగాలను కూడా పరిశీలించి పాఠకులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రంథాలయంలో పాఠకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు, భవన మరమ్మత్తులను చేపడతామని అన్నారు.

ఎక్కువ మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. గ్రంథాలయానికి నూతన భవన నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రంథాలయంలో అన్ని విభాగాలను, ఆవరణను పరిశీలించి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రంథాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.భవన మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టి నివేదిక ఇవ్వాలని గ్రంథాలయ కార్యదర్శి ఆదేశించారు. గ్రంథాలయంలో పాఠకులకు కావలసిన అన్ని దిన,మాస పత్రికలను,మ్యాగ్జిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed