కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మన కొలువులు మనకేమ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Sumithra |
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మన కొలువులు మనకేమ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, తాండూర్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మన కొలువులు మనమే చేసుకుందామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లాతాండూర్ మండలం ఐబీలో మంగళవారం నిర్వహించిన పీపుల్స్ మార్చ్ కార్నర్ మీటింగ్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియమకాలు ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుడిగా చెప్పుకునే సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఉద్యమం సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత గ్రామానికి ఒక్కఉద్యోగం కూడా కల్పించలేదని మండిపడ్డారు.

లక్షల కోట్లు మిగులు బడ్జెట్ ఉన్నా తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగం యువకులకు ఉద్యోగ కల్పన సంగతేమో గాని కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు సాయం, ప్రకృతి వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, రుణమాఫీ, నిరుద్యోగ యువత కు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ రావు, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం రవీందర్ రెడ్డి, నాయకులు గట్టు మురళీధర్రావు, చిలుముల శంకర్, దామోదర్ రెడ్డి పేరం శ్రీనివాస్, బండి పోషం, పుట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అడుగడుగునా భట్టికి ఆత్మీయస్వాగతం...

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యస్థాపనే లక్ష్యంగా సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం 13వ రోజు మంచిర్యాల్ జిల్లాలోని తాండూర్ మండలంలో అడుగు పెట్టింది. రేపల్లెవాడ పాదయాత్ర శిబిరం విడిది వద్ద మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ భట్టికి తిలకం దిద్ది మంగళ హారతితో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలు కోలాటం ఆడుతూ, యువకులు నృత్యాలు చేస్తూ అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికారు. బట్టి యాత్రకు సంఘీభావం తెలిపేందుకు నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు.

Advertisement

Next Story