- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీపుల్స్ మార్చ్ కు ప్రజాస్పందన..
దిశ, బెల్లంపల్లి : సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి స్పందన కనిపించింది. బెల్లంపల్లి ఎంసీ గ్రౌండ్ లో రెండు రోజులుగా బస చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శుక్రవారం పీపుల్స్ మార్చ్ ను చేపట్టారు. ఏఎంసీ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మండలంలోని తాళ్ల గురజాల, బట్వాన్ పల్లి, పెరిక పల్లి గ్రామాలలో సాగింది. అంతకు ముందు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించి పాదయాత్రలో పాల్గొన్నారు. ఎల్లమ్మగుడి వద్ద ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ష్కాలర్ షిప్, కళాశాల భవనం సౌకర్య వంతంగా లేదని విన్నవించారు.
హాస్టల్ భవనం రెండు కిలోమటర్ల దూరంలో ఉందని, ప్రతిరోజూ నడుచుకుంటూ వస్తున్నామని విద్యార్థులు వాపోయారు. అందుబాటులోనే హాస్టల్ భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 800 మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో సరైన టాయిలెట్లు లేవని, ల్యాబ్ సౌకర్యం లేదు, గ్రౌండ్ లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు బస్ సదుపాయం లేకపోదన్నారు. కళాశాలలో తాగునీటి వసతి కూడా లేదని భట్టి విక్రమార్కకు వివరించారు. అంతేకాకుండా బెల్లంపల్లిలోనే పీజీ కాలేజ్ ఏర్పాటు చేయాలని భట్టికి విద్యార్థునులు వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యా, వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చిందని సెల్ఫ్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక విద్య, వైద్యానికి నిధులు వెచ్చించడం లేదని విమర్శించారు. కొత్త కాలేజీలే ఏర్పాటు చేయడం లేదని అన్నారు.
కాంగ్రెస్ హాయంలోనే హైదరాబాద్ ఐఐటీ, త్రిబుల్ ఐటీలు, కొత్త కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తానని భట్టి విక్రమార్క విద్యార్థులకు హామీ ఇచ్చారు. సెల్ఫ్ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు గ్రామాల్లో నీరజనాలు పలికారు. తాను ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు నేరుగా ఆయనకు విన్నవించారు. తాగునీరు రహదారులు కనీస వసతులు లేవని మొరపెట్టుకున్నారు. ఈ పాదయాత్రలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ నాయకులు చిలుముల శంకర్, నాతరి స్వామి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ మెన్ తొంగల మల్లేష్ సూరిబాబు పాల్గొన్నారు.