- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంచిర్యాల బీజేపీలో లుకలుకలు.. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో మొదలైన అంతర్గత పోరు
దిశ, మంచిర్యాల టౌన్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మార్పు తో మంచిర్యాల జిల్లా బీజేపీలో పలు విబేధాలు ఏర్పడ్డాయి.క్రమ శిక్షణ కు మారు పేరు గా ఉన్న పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి కి పోటీ పడుతున్న నాయకుల తీరు పలు విమర్శల కు తావు ఇస్తుంది.ఒకే వేదిక పంచు కున్నపటికి ఇద్దరి మధ్య విబేధాలు తార స్థాయి కి చేరుతున్నాయి.ప్రస్తుత మంచిర్యాల బీజేపీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి రఘునాథ్ మాజి జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లా రెడ్డిల మధ్య అంతర్గత కుమ్ములాట మొదలు అయింది. జూన్ నెల 21 నా లక్షెట్టిపేట లో రఘునాథ్ ఏర్పాటు చేసిన సభతో జిల్లాలో బీజేపీ రూపు రేఖలు మారబోతున్నాయి అనుకున్న తరుణంలో, సభ అనంతరం జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ నాయకులకు పెద్ద తలనొప్పి గా మారింది.
లక్షెట్టిపెట్ సభలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ అధిష్టానాన్ని కుదిపేసినట్లు తెలుస్తుంది.అనంతరం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా కిషన్ రెడ్డిని నియమించడంతో మంచిర్యాల మాజి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లా రెడ్డి కాస్త దూకుడు పెంచాడు. నియోజక వర్గంలోని బీజేపీ సీనియర్ నాయకులను పోగు చేసి తన నివాసంలో గత కొన్ని రోజులుగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.ఇటీవల బీజేపి పార్టీ తరపున జిల్లాలో పలు పదవులు పొందిన వారిని మల్లారెడ్డి తన ఇంటికి ఆహ్వానించి సన్మానం చేశాడు,వారంతా రఘునాథ్ ను వ్యతిరేకిస్తూ జిల్లా అధ్యక్ష పదవి రెండు నెలల క్రితమే ముగిసింది అని,వెంటనే అధిష్టానంతో మాట్లాడి మంచిర్యాలలో బీజేపీ జిల్లా అధ్యక్షున్ని మార్చాలి అనే డిమాండ్ తో కిషన్ రెడ్డిని కలిసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షుడి వ్యవహార శైలి పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారని, జిల్లాకు సంబంధించిన ముఖ్య మైన పదవులను తన సామాజిక వర్గానికి చెందిన వారికే కట్ట పెట్టడం మిగిలిన సీనియర్ నాయకుల ను పక్కన పెట్టడం ,కొందరు కార్యకర్తలకు జీతాలు ఇస్తూ పోషిస్తున్నాడు అనే పలు రకాల కారణాలతో ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పై ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నట్లు సమాచారం.
మల్లారెడ్డికి కిషన్ రెడ్డి మధ్య చాలా వరకు వ్యక్తిగత సంబంధాలు ఉండడం ,జిల్ల అధ్యక్ష పదవిలో మల్లారెడ్డి కొనసాగినపుడు పలు సర్లు కిషన్ రెడ్డి తో మంచిర్యాల జిల్లా లో పలు కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉండడం తో జిల్లా అధ్యక్ష పదవిని మల్లారెడ్డి తిరిగి తెచ్చుకునెలా వారు ప్రోత్సాహం అందించడం గమనార్హం. ఇది ఇలా ఉండగా మంచిర్యాల జిల్లా బిసి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సీనియర్ వైద్యుడు ఒకరు రాబోవు రోజుల్లో తెలంగాణ బీజేపీ చేరికల,ఎన్నికల ఇంఛార్జి ఛైర్మెన్ ఇటెల రాజేందర్ ఆధ్వర్యం లో బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.పలుసార్లు టీడీపీ, బీజేపి పార్టీ నుండి మంచిర్యాల నియోజక వర్గ ఎమ్మేల్యే టిక్కెట్ ఆశించి భంగ పడ్డ ఆ వైద్యుడు, ఇటీవల మంచిర్యాల నియోజక వర్గం లో ఎక్కువ శాతం బీసీ నినాదం వినపడటంతో చివరి సారిగా అవకాశం కోసం నియోజక వర్గంలో బీసీల ప్రాముఖ్యత చాటేందుకు మరోసారి బీజేపీ చేరి ఎమ్మేల్యే టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది.