మా ఊరు పేరు మార్చండి

by Sridhar Babu |
మా ఊరు పేరు మార్చండి
X

దిశ, బోథ్ : మండలంలోని లంబాడి తండా గ్రామంలో గ్రామస్తులు సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. లంబాడి తండా గ్రామం పేరును బాబెరా తండాగా ప్రకటించాలని సర్వేకు వెళ్లిన అధికారులను కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ రమేష్ లంబాడి తండా గ్రామానికి చేరుకొని రైతులు, గ్రామస్తులతో మాట్లాడి సర్వేకు సహకరించాలని కోరారు. మీ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో యథావిధిగా గ్రామంలో సర్వే కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జీవన్ రెడ్డి ,ఎన్యూమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed