డంపింగ్​ యార్డును ఆక్రమించిన బీఆర్​​ఎస్​ నేతలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Sridhar Babu |   ( Updated:2023-01-16 13:48:22.0  )
డంపింగ్​ యార్డును ఆక్రమించిన బీఆర్​​ఎస్​ నేతలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, కాగజ్ నగర్ : డంపింగ్​ యార్డును బీఆర్​ఎస్​ నేతలు ఆక్రమించుకున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం కాగజ్ నగర్ పట్టణంలోని డంపింగ్​ యార్డ్​​ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 సంవత్సరంలో కాగజ్నగర్ మున్సిపాలిటీకి రెవెన్యూ అధికారులు 9 ఎకరాల స్థలాన్ని అప్పజెప్పినట్టు పేర్కొన్నారు. ఇందుకు స్పష్టమైన కాపీ కూడా అందజేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని టీఆర్ఎస్ నాయకులు బాహాటంగా కబ్జా చేసి ఫ్లాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ తతంగం వెనుక సిరిపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన జిల్లా కలెక్టర్, కాగజ్నగర్ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ ఇంతవరకు స్పందించడం లేదన్నారు. అధికార పార్టీ ప్రభుత్వ భూములను రక్షించాల్సింది పోయి భక్షించడం ఏంటని ప్రశ్నించారు. ఈ భూముల తత్వాన్ని పరిశీలిస్తే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హస్తమున్నట్టు అర్ధమవుతుందని పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో వెంటనే స్పందించాలన్నారు. లేని పక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం బహుజన రాజ్యాధికార యాత్ర కాగజ్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో ముగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ తీశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి గణపతి, సిర్పూర్​ తాలూకా ఇంచార్జ్ హర్షద్ హుస్సేన్, టౌన్ ప్రెసిడెంట్ నక్క మనోహర్, కొమరం జిల్లా అధ్యక్షుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed