- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎస్పీ కార్యకర్త పై బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప అనుచరుల దాడి
దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్నగర్ మండలం పాత సార్సాల పోలింగ్ కేంద్రం వద్ద సిర్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప అనుచరులు బీఎస్పీ పార్టీకి చెందిన కార్యకర్త ఇందూరి రవి పై దాడికి పాల్పడ్డారు. కోనేరు కోనప్ప ఓటమి భయానికి ఇది నిదర్శనమని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన బీఆర్ఎస్ గుండాలను పోలీసులు అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. తన 26 ఏళ్ల పోలీస్ సర్వీస్ లో ఇంత బలహీనమైన పోలీస్ వ్యవస్థను చూడలేదన్నారు. పోలీసులు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల అడవులకు మడుగులొత్తుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద బీఎస్పీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, డిసెంబర్ 3 తర్వాత కోనప్ప కొందరు పోలీసులు కలిసి ఆడుతున్న అరాచక ఆటలు సిర్పూర్ గడ్డ పై సాగవని హెచ్చరించారు.