Bandi Sanjay కి బాసర వేద పాఠశాల విద్యార్థుల ఆశీర్వాదం

by Mahesh |   ( Updated:2022-12-05 07:16:42.0  )
Bandi Sanjay కి బాసర వేద పాఠశాల విద్యార్థుల ఆశీర్వాదం
X

దిశ, ప్రతినిధి నిర్మల్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఎనిమిదో రోజు నిర్మల్ జిల్లాలో కొనసాగుతుంది. సోమవారం నిర్మల్ మండలం అక్కాపూర్ గ్రామం లో ప్రారంభం అయిన బండి పాదయాత్ర ముఠా పూర్, వడ్యాల్ మీదుగా కనకాపూర్ కు చేరింది. ఇక్కడ బాసర వేద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బండి సంజయ్‌ను ఆశీర్వదించారు. ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

దారి పొడవునా ఆయన ఆయా గ్రామాల ప్రజలను రైతులను కలుస్తూ.. ముందుకు సాగుతున్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యలో వడ్ల రైతులతో మాట్లాడారు. రానున్నది బీజేపీ సర్కార్ అని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం రోజు అంతా 14 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర సాగి మామడ మండల కేంద్రంలో రాత్రి బస చేయమన్నారు.

Read More.....

ఈ నెల 16న తెలంగాణకు JP Nadda

Advertisement

Next Story