బైంసాలో నిషేధిత గుట్కా స్వాధీనం...

by Sumithra |
బైంసాలో నిషేధిత గుట్కా స్వాధీనం...
X

దిశ, భైంసా : తెలంగాణ ప్రభుత్వం గుట్కాపై నిషేధం విధించిన సందర్భంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిలా ఆదేశాల మేరకు బైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భైంసా పట్టణ సీఐ రాజా రెడ్డి, ఎస్.ఐ షరీఫ్, నారాయణ్ సింగ్ మూడు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని అన్ని షాపులు, గోదాముల పై ఏక కాలంలో తనిఖీ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో దాదాపు 6 లక్షల రూపాయల గుట్కాని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, పట్టణ సీఐ రాజారెడ్డి మాట్లాడుతూ నిషేధ గుట్కా, తంబాకు సంబంధిత ఉత్పత్తులు ఎవరైనా అమ్మిన, రవాణా చేసినా, నిల్వ ఉంచిన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సైలు ఎం.డి షరీఫ్, నారాయణ సింగ్, ఎఎస్సై తారచాంద్, కానిస్టేబుల్స్ భుషాను, రమేష్, శైలేష్, సాయి ప్రశాంత్, శంకర్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed