నిషేధిత గ్లైఫోసెట్ పట్టివేత..

by Sumithra |
నిషేధిత గ్లైఫోసెట్ పట్టివేత..
X

దిశ, చింతలమానేపల్లి : మండలంలోని గూడెం ప్రాణహిత సరిహద్దుల్లో గల చెక్ పోస్ట్ వద్ద మంగళవారం చింతలమానెపల్లి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు నిషేధిత గ్లైఫోసెట్ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. చింతలమానెపల్లి ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కన్నెపల్లి మండలం దాంపూర్ గ్రామానికి చెందిన తలండి రవి అనే వ్యక్తి మహారాష్ట్ర నుండి గ్లైఫోసెట్ తీసుకువస్తున్నాడు. అదే సమయంలో పోలీసులు వాహనతనిఖీల్లో భాగంగా పట్టుకున్నామన్నారు.

వీటి రూ. 20, 280 విలువ గల (నిషేధిత గ్లైఫోసెట్ ప్యాకెట్లు 12 కిలోలు, 5లీటర్లు) వాటిని స్వాదినం చేసుకొని తలండి రవి పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో ఏఈవో విజయ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. కాగా నిషేధిత గ్లై ఫోసెట్, నకిలీ విత్తనాలు ఎవరు విక్రయించినా, సరఫరా చేసినా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తుల వివరాలు పోలీసులకు తెలియజేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి తగిన ప్రోత్సహం అందజేస్తామని ఎస్సై విజయ్ కుమార్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed