- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఇంటి ముందు అభ్యర్థిని.. కంటి ముందు అభివృద్ధి : బాల్కసుమన్
దిశ, రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని స్థానిక సూపర్ బజార్ ఏరియాలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విజయాన్ని కాంక్షిస్తూ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తామని, ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని సుమన్ అన్నారు. క్యాతనపల్లి, మందమర్రి పురప్రజలను ఉద్దేశించి మీ ఇంటి ముందు నా ఇల్లు అని కంటి ముందు నియోజకవర్గ అభివృద్ధి కనిపిస్తుంటే ఇతర పార్టీల అభ్యర్థులు ఎందుకు మనకు అవసరమని ప్రజలే ఒకసారి ఆలోచించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రాలలో గ్యారంటీ పథకాలు హామీలకే పరిమితం అయ్యాయని, ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
గతంలో బొగ్గు గనులను మూతవేసిన ఘనత కాంగ్రెస్ మంత్రులకే చెందుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో సూటు కోట్లతో వచ్చే అభ్యర్థులు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మవద్దని ఇటువంటి వారికి ఓటు రూపంలో ప్రజలు బుద్ధిచెప్పాలని కోరారు. పట్టణానికి చెందిన కొందరు బీఆర్ఎస్ నాయకులు మొన్నటిదాకా తమ పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచి సూటుకేసులకు లొంగ్గి కాంగ్రెస్ నేతలకు జిందాబాద్ లు కొడుతూన్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించె పనిలోపడ్డారని పార్టీలు మార్చే మోస రాజకీయ నాయకులకు ప్రజలే జవాబు చెబుతారని ఆయన పేర్కొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తిట్టిన వీడియో క్లిప్పింగ్ ని ప్రజలకు చూపించారు. ఇలాంటి సంస్కృతి హీనులకు నియోజకవర్గం కట్టబెడితే 100 కోట్లు ఖర్చుపెట్టి 1000 కోట్లను సూట్ కేసుల్లో పెట్టుకొని పోతారని అన్నారు. తమ పార్టీ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతిఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కంబాగోని సుదర్శన్, ఇంచార్జి గాండ్ల సమ్మయ్య,వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.