- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తిచేయాలి..
by Sumithra |
X
దిశ, తాండూర్ : సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలను ఒకే చోట లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ నిర్మాణాన్ని చేపట్టిందన్నారు.
ప్రహరీ గోడ, రోడ్ల విద్యుత్, ఫర్నిచర్ పనులు పూర్తి చేయాలని సూచించారు. మహిళ ఉద్యోగుల పిల్లల పర్యవేక్షణకై శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి అధికారులను నియమిస్తామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఉద్యానవనం ఏర్పాటు చేసి పూలమొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ ఉన్నారు.
Advertisement
Next Story