- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎస్సీ, ఎస్జీటీ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
దిశ, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న డీఎస్సీని దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ, ఎస్జీటీ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ ,ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోవాలని కోరారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈనెల 14 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 26 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5.00 లక్షల లోపు ఉండాలని తెలిపారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్‌జీటీకి సంబంధించి ఇంటర్మీడియట్, డైట్, టెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఈ ఉచిత శిక్షణ 75 రోజులు ఉంటుందని, నిపుణులైన అధ్యాపకుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9949684959 - 08732221280నంబర్లు సంప్రదించాలని కోరారు.