- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కదిలి శివరాత్రి జాతరలో అపశృతి..
by Sumithra |
X
దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలి పాపహారేశ్వర స్వామి జాతరలో అపశృతి చోటు చేసుకుంది. దేవాలయ ప్రహరీ గోడ కూలి ముగ్గురు భక్తులు గాయపడ్డారు. శనివారం దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూలో ఉండగా పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలి పోయింది. దీంతో భక్తులు ప్రహారీ పక్కన ఉన్న లోయలో పడిపోయారు.
ఆదిలాబాద్ కు చెందిన ఒక భక్తుడితో పాటు, నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన భక్తురాలు, నిర్మల్ మండలం కొండాపూర్ కు చెందిన మరో భక్తురాలు లోయలోకి జరిపోయారు. దీంతో వారికి గాయాలయ్యాయి. సీఐ శ్రీనివాస్ వెంటనే స్పందించి పోలీస్ ల సహాయంతో వారిని సురక్షితంగా పైకి తీసుకు వచ్చారు. వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్సలు చేశారు. కాగా స్వామివారి దయతోనే బతికి బయట పడ్డామని బాధితులు అన్నారు. పోలీసుల చొరవను పలువురు ప్రశంశించారు.
Advertisement
Next Story