- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిలాబాద్ బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా.. కాంగ్రెస్ లో చేరిక
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి తన నామినేషన్ను విత్ డ్రా చేసుకున్నారు. అంతేకాకుండా ఆ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి అయిన ఉయిక ఇందిరా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ లో రాజకీయం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
సొంత పార్టీ రెబల్ అభ్యర్థుల పోటీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డికి తల నొప్పిగా మారగా ఇటీవల బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన ఉయిక ఇందిరా ఆ పార్టీకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించింది. ఉయిక ఇందిరా పార్టీలో చేరడంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదివాసి ఓట్లు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాలతో ఆదిలాబాద్ రాజకీయం ఓటర్లకు అంతుచిక్కకుండా మారింది. కాగ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మరి కొంతమంది నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.